Header Banner

అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం! త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్..

  Thu Mar 06, 2025 20:18        Politics

శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ  మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం  సీజ్ చేస్తే..... కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిందని చెప్పారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు. "రాష్ట్రంలో 2019-2024 మధ్య పౌరసరఫరాల దాడులలో 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,664 మంది. ఇందులో 148 మందిని రెండుసార్లు కంటే ఎక్కువ పర్యాయాలు అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. బియ్యంతో పాటు  512 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యం జప్తు చేశారు. ఇందులో 25 వేల 386 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. 13 సంస్థలపై కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం" అని నాదెండ్ల వివరించారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NadendlaManohar #APAssemblySession #Janasena #TDP-JanaSena-BJPAlliance